- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేయర్, చైర్మన్ల ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. ఎస్ఈసీ అధికారిక నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ఈనెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, పరోక్ష పద్ధతిలో కీలక పదవుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ (Official Notification) విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌లో ఈనెల 16న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇదే సమావేశంలో తొలుత వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
కాగా, తాజాగా విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఫలితాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ, సుమారు 36 మున్సిపాలిటీల్లో హంగ్ (Hung) ఏర్పడటంతో మేయర్, చైర్మన్ పదవుల ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పరోక్ష ఎన్నికలో చేతులెత్తే విధానం ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఇక్కడే ఎక్స్-అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.






