10 గంటలుగా ఈడీ విచారణ.. ఇంకా బయటకు రాని కవిత

by Dishafeatures2 |
10 గంటలుగా ఈడీ విచారణ.. ఇంకా బయటకు రాని కవిత
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరైంది. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పది గంటలకు పైగా ఈడీ విచారణ కొనసాగుతుండటంతో కవిత అరెస్ట్ అవుతారా లేక విచారణను మరోసారి వాయిదా వేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ తో రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు టీవీల ముందు అతుక్కుపోయారు.

ఈ నెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత.. రాత్రి 8గంటల వరకే బయటకు వచ్చారు. కానీ ఈ సారి రాత్రి తొమ్మిది కావొస్తున్నా ఆమె బయటకు రాకపోవడంతో కవిత అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నెల 24న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. దీంతో ఆ రోజు సుప్రీంకోర్టులో కవిత హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో 24 తర్వాత కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read more:

సాయంత్రం ఏం జరగబోతుంది.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ!


Next Story

Most Viewed