- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమ్మిట్ అతిథులకు అదిరిపోయే తెలంగాణ స్పెషల్ స్నాక్స్
నేడు, రేపు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు ఫ్యూచర్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

దిశ, వెబ్ డెస్క్: నేడు, రేపు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు ఫ్యూచర్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 6 ఖండాలు, 24 దేశాలకు చెందిన 150 మందికి పైగా అతిథులు పాల్గొననున్నారు. అలాగే 2 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సమ్మిట్ లో పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. అయితే సమ్మిట్ కు హాజరయ్యే అతిథులకు ప్రభుత్వం అదిరిపోయే తెలంగాణ స్పెషల్ స్నాక్స్ ను అందివ్వబోతుంది.
అందులో సకినాలు, ఇప్ప పువ్వు లడ్డూలు, నువ్వుల లడ్డూలు, గారెలు, మక్క పేలాలు, సర్వపిండి వంటి తెలంగాణాకు మాత్రమే చెందిన ప్రత్యేక చిరుతిళ్ళు ఉండబోతున్నాయి. ఇక మధ్యాహ్న భోజనంలో దమ్ బిర్యానీ, పాయా, పత్తర్ క ఘోష్, మటన్ కర్రీ వంటివే కాకుండా అతిధుల ఆయా దేశాల స్పెషల్స్ కూడా వడ్డించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ తో మహేశ్వరం చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా సందడి నెలకొంది.
Read More..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే!






