- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్..
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’.

దిశ, సినిమా: ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరోడు.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమెడియన్‌గా, హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాలకు క్రేజీ టైటిల్స్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల విషోర్, మురళీధర్ గౌడ్, నరేష్ వీకే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 4న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే, తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘నా కంటి మీద కునుకే’ అని సాగే మొదటి పాటను జూలై 22న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్ ఇస్తూ.. అత్యంత మధురమైన భావాలకు అత్యంత అందమైన రాగం అర్హమైనది’ అనే ఒక అందమైన క్యాప్షన్‌ను కూడా జత చేశారు. పాట అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లరి నరేష్ ఫుల్ జోష్‌తో మాస్ స్టెప్ వేస్తుండగా, ఆయన చుట్టూ అమ్మాయిలు, పూల వర్షం కురుస్తున్నట్లు చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక మంచి ఎనర్జిటిక్ అండ్ మెలోడియస్ సాంగ్ కాబోతుందని అర్థమవుతోంది






