శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వివాదం.. సీఎం చంద్రబాబుకు చైర్మన్ లేఖ

by Vemula.Srinu Prasad |

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సాలు మండల విషయంలో వివాదం నెలకొంది. దీంతో ఆలయం చైర్మన్ రమేశ్ నాయుడు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు....

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వివాదం.. సీఎం చంద్రబాబుకు చైర్మన్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సాలు మండల విషయంలో వివాదం నెలకొంది. దీంతో ఆలయం చైర్మన్ రమేశ్ నాయుడు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సీఎంకు లేఖ రాసిన ఆయన.. శ్రీశైలం ఆలయంలో సాలు మండపాల కోసం కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. టెండర్ల విషయంలో నిబంధనలు పట్టించుకోవడంలేదని, బోర్డును పట్టించుకోవడం లేదని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌లో సాలు మండపాల నిర్మాణాలు లేవని స్పష్టం చేశారు. క్యూకాంప్లెక్స్, ఎనిమిటీస్ కాంప్లెస్ కావాలని ఆలయం చైర్మన్ రమేశ్ నాయుడు పేర్కొన్నారు. రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు. దేవస్థానం ప్రణాళికలు బోర్డు ఆమోదంతోనే ముందుకెళ్లాలని చెప్పారు.

కాగా శ్రీశైలంలో రూ. 19 కోట్లతో అభివృద్ధి పనులు జరుతున్నాయి. అయితే సాలు మండపాల నిర్మాణంపై దేవాదాయ కమిషనర్, ఆలయ చైర్మన్ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. సాలు మండపాల నిర్మాణాల కోసం టెండర్లను త్వరగా ఆమోదించుకునేందుకు కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ టెండర్లను ఇప్పటికే ఆలయ చైర్మన్ రెండు సార్లు తిరస్కరించారు. దీంతో ఆలయం అభివృద్ధి పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు దేవస్థానం చైర్మన్ రమేశ్ నాయుడు లేఖ రాయడం సంచలనంగా మారింది. చూడాలి మరి ఏం జరుగతుందో.

Next Story