- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో దశకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. ప్రభుత్వం, యాజమాన్యం తమ డిమాండ్ల పట్ల మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. ప్రభుత్వం, యాజమాన్యం తమ డిమాండ్ల పట్ల మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెలో భాగంగా ఏప్రిల్ 23న (రేపు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్‌షాపుల వద్ద 'మహాధర్నా'లు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 21న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో జేఏసీ నాయకత్వం సుదీర్ఘంగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 32 డిమాండ్లపై చర్చ జరిగినప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారంపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు. ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేం అని అధికారులు చేతులెత్తేయడంతోనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జేఏసీ స్పష్టం చేసింది.
ప్రధాన డిమాండ్లు ఇవే..
= ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో విలీనం చేయాలి.
= 2021 వేతన సవరణను 30 శాతానికి తగ్గకుండా అమలు చేయాలి.
= గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేయాలి
= ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి.
= కార్మిక సంఘాలను అనుమతించి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
ఉద్యమ పులిబిడ్డలకు జేజేలు...
సమ్మెను విజయవంతం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను "ఉద్యమ పులిబిడ్డలు"గా సంబోధిస్తూ జేఏసీ నాయకత్వం వారికి అభినందనలు తెలిపింది. ప్రభుత్వం ప్రజలను, కార్మికులను తప్పుదారి పట్టిస్తోందని, న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. రేపు ఉదయం 5 గంటల నుంచే అన్ని డిపోల వద్ద మహాధర్నాలలో పాల్గొని నిరసన తెలపాలని కార్మికులను కోరారు.






