- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తప్పిన పెను ప్రమాదం.. మరోసారి లీకైన ద్రవపు ఉక్కు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్లాంట్ లో మరోసారి ల్యాడిల్ నుండి ద్రవపు ఉక్కు లీక్ అయ్యింది. SMS.. 1 లోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌లో ఉదయం 5.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్లాంట్ లో మరోసారి ల్యాడిల్ నుండి ద్రవపు ఉక్కు లీక్ అయ్యింది. SMS.. 1 లోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌లో ఉదయం 5.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే ఈనెల 8న స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS-2) విభాగంలో ద్రవ ఉక్కు లీక్ అయ్యింది. ఒక్కసారిగా టన్నుల కొద్ది ఉక్కు ద్రవం పడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు కొందరు సజీవదహనం అయ్యారు.
మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు ఈఘటనలో మొత్తం 9మంది మరణించారు. చినిపోయినవారిలో ఐదుగురు పర్మినెంట్ ఉద్యోగులు, నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే మరోసారి స్టీల్ ప్లాంట్ లో ద్రవపు ఉక్కు లీకేజీ అవ్వడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.






