గాలి దుమారానికి కూలిన చెట్టు.. ఆటో ధ్వంసం

by Batti.Sumithra |

మండల కేంద్రంలో బుధవారం రాత్రి వచ్చిన బలమైన గాలితో కూడిన వర్షానికి మండల కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చెట్టు నేలకొరింగింది.

గాలి దుమారానికి కూలిన చెట్టు.. ఆటో ధ్వంసం
X

దిశ, వెంకటాపురం(నూగూరు): మండల కేంద్రంలో బుధవారం రాత్రి వచ్చిన బలమైన గాలితో కూడిన వర్షానికి మండల కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చెట్టు నేలకొరింగింది. దీంతో అక్కడే నిలిపి ఉన్న ఆటో మీద పడడంతో ఆటో పై భాగం పూర్తిగా దెబ్బతింది. దానికి అనుకోని ఉన్న విద్యుత్ వైర్లు సైతం తెగిపడ్డాయి. దీంతో కొంత సమయం మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం కలుగగా స్పదించిన స్థానిక విద్యుత్ సిబ్బంది అడ్డంకులు తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

Next Story