నిరుద్యోగులకు తాత్కాలిక కండక్టర్ పోస్ట్.. రోజుకి రూ. 800!

by Kodari Anjali |

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా.. మధిర డిపో మేనేజర్ తాత్కాలిక సేవల కోసం నిరుద్యోగులకు అవకాశం ఇచ్చారు.

నిరుద్యోగులకు తాత్కాలిక కండక్టర్ పోస్ట్.. రోజుకి రూ. 800!
X

దిశ, మధిర: టీజీఎస్ఆర్టీసీ మధిర డిపో నందు తాత్కాలికంగా కండక్టర్లను ఎంగేజ్ చేయబడుతుందని మధిర డిపో మేనేజర్ రామిశెట్టి రామయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కండక్టర్‌గా విధులు నిర్వహించడానికి అభ్యర్థి అర్హత పదో తరగతి పాస్ ఉత్తీర్ణులై ఉండాలని, వారి ఎస్ ఎస్ సి ఒరిజినల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని మధిర డిపోకు రాగలరని తెలిపారు. మధిర డిపో సంబంధిత అధికారులు సర్టిఫికెట్లను వెరిఫై చేసి తాత్కాలిక కండక్టర్‌గా డ్యూటీలకు పంపిస్తారని వెల్లడించారు.. వారికి రోజుకి రూ.800 రూపాయలు ఇవ్వబడునని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరని పేర్కొన్నారు.

Next Story