రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు.. కవిత కొత్తపార్టీ ప్రకటనపై గుత్తా కామెంట్స్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-07 11:13:09  IST  )

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దాని ఆమోదం, కొత్తపార్టీ ప్రకటనపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు.. కవిత కొత్తపార్టీ ప్రకటనపై గుత్తా కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దాని ఆమోదం, కొత్తపార్టీ ప్రకటనపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎవరైనా భావోద్వేగంతో రాజీనామా చేసినపుడు కొంతకాలం వేచి చూస్తామని, కవిత విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. ఆమె విజ్ఞప్తి మేరకే రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఇక కవిత కొత్త పార్టీ ప్రకటన విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చినా దాని మనుగడ కష్టమన్నారు. గతంలో కొత్తగా వచ్చిన కొన్ని రాజకీయ పార్టీలు అలాగే కనుమరుగయ్యాయని గుర్తు చేశారు.

ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడుతారన్నదానిపై స్పష్టత లేదని గుత్తా సుఖేందర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని పేర్కొన్నారు. హిల్ట్ విధానం ద్వారా రాష్ట్రంలో ఎలాంటి అవినీతి జరగదని గుత్తా స్పష్టం చేశారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం సరికాదని గుత్తా సుఖేందర్ అభిప్రాయపడ్డారు.

READ MORE ....

కొత్త పార్టీని స్థాపించి నడపటం చాలా కష్టం.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

Next Story