కొత్త పార్టీని స్థాపించి నడపటం చాలా కష్టం.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 11:13:27  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల రాజకీయ జీవితంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త పార్టీని స్థాపించి నడపటం చాలా కష్టం.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రాజకీయ జీవితంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. నెక్ట్స్ సమావేశాలు కొత్త మండలి భవనంలోనే జరుగుతాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని తెలిపారు. ‘‘కల్వకుంట్ల కవిత ముందే డైరెక్ట్‌గా వచ్చి రాజీనామా సమర్పించి ఉంటే.. అప్పుడే ఆమోదించి ఉండేవాళ్లం. కానీ అప్పుడు పీఏతో రాజీనామా పంపించారు. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయమని భావించి కాస్త సమయం ఇచ్చాం. ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పడం బాధ్యతగా భావించి చెప్పాను. మండలికి వచ్చి స్వయంగా వివరణ ఇచ్చింది కాబట్టి ఆమోదం తెలిపాం. మరోవైపు తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీకి స్పేస్ లేదు. ఇలా చాలా పార్టీలు వచ్చి కనుమరుగు అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టి నడించడం చాలా కష్టం. బీఆర్ఎస్ పార్టీపై, ఆమె కుటుంబంపై కవిత చేసిన కామెంట్లు.. ఆమె పర్సనల్. వాటిపై నేను స్పందిచను.. జడ్జిమెంట్ కూడా ఇవ్వలేను’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More..

కవిత రాజీనామా ఆమోదం

Kavitha: బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‍లోకి కవిత!.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Next Story