- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత రాజీనామా ఆమోదం
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2025 సెప్టెంబరులో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసారు. అప్పటి నుంచి ఆమె రాజీనామా పెండింగ్ లో ఉండగా.. నిన్న కవిత మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా చైర్మన్ ను కోరారు. దీంతో నేడు ఆమె రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ పడింది. కాగా 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో.. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు.
Next Story






