- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"మా టార్గెట్ 2028.. ఫైనల్ డెసిషన్ ఆయనదే" : తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ హాట్ కామెంట్స్
రామచంద్రరావు పొత్తుపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన వింగ్ స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు జనసేనతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన వింగ్ స్పందించింది. పొత్తులపై జాతీయస్థాయిలో తుది నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దే అని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా లేదా అన్నదానిపై తమ నాయకుడు పవన్ కల్యాణే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. జనసేనకు బలం ఉన్న స్థానాల్లో కచ్చితంగా క్యాండిడేట్లను నిలబెట్టి పోటీ చేస్తామని చెప్పారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో జనసేనను మరింత బలపరిచేందుకు జనసైనికులు కృషి చేస్తున్నారన్నారు.
సంచలనం రేపిన రామచంద్రరావు వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేనపార్టీతో పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్ఠానానికి కూడా ఈ విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన - బీజేపీ - టీడీపీ పొత్తు వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో విజయం రావచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. వాటిపై జనసేన స్పందించింది. తెలంగాణలో బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయో లేదో అన్నదానిపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read More..






