Municipal Elections: జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ క్లారిటీ

by Prasad Jukanti |   (  Updated:2026-01-11 06:22:52  IST  )

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని జనసేన చేసిన ప్రకటనతో రాష్ట్రంలో పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది.

Municipal Elections: జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నిక్లలో (Telangana Municipal Elections) పోటీ చేయబోతున్నట్టు జనసేన పార్టీ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ అనౌన్స్ మెంట్‍తో పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోందా లేక బీజేపీతో జట్టు కడుతుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకు పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఒంటరిపోరే అని చెప్పారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన రామచందర్ రావు (Ramchander Rao).. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. ఏపీలో రాజకీయ పరిణామాల ఆధారంగానే అక్కడ కూటమి ఏర్పాటు అయిందని కానీ ఇక్కడి పరిస్థితుల ఆధారంగా ఒంటరిగానే పోటి చేసి విజయం సాధిస్తామన్నారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో మేము బలంగా ఉన్నాం. అధిష్టానానికి కూడా ఇదే విషయం చెబుతామన్నారు. ఎవరైనా మద్దతిస్తే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

తెలంగాణపై పవన్ ఫోకస్:

తెలంగాణ రాజకీయాలపై జనసేన (Jana Sena Party) చీఫ్ పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టడం స్టేట్ రాజకీయాల్లో హాట్ టాపిక్‍గా మారింది. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో జనసేన మద్దతు దారులు సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇటీవల కొండగట్టుకుకు వచ్చిన సమయంలో జనసేన అధినేత వీరితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమయంలోనే తెలంగాణ రాజకీయాలపై పవన్ (Pawan Kalyan) సీరియస్ గానే ఫోకస్ చేశారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఇంతలో తెలంగాణ మున్సిపల్ బరిలో నిలవబోతోందని జనసేన నిర్ణయం తీసుకోవడం వెనుక తెలంగాణ రాజకీయాలపట్ల జనసేన చీఫ్ భారీ వ్యూహంతోనే ఉన్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో ఓ వైపు వరుసగా ఎన్నికల్లో పోటీకి జనసేన సై అంటుంటే వారితో పొత్తు జట్టుకలిసేందుకు బీజేపీ మాత్రం నో చెబుతూ వస్తోంది. మరో వైపు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఇక్కడ రాజకీయంగా దూరం పాటిస్తున్న వేళ జనసేన మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో, సర్పంచ్, ఇప్పుడు మున్సిపల్ పోరులో బరిలోకి దిగుతుండటం భవిష్యత్ లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా అనే చర్చ గుప్పుమంటోంది.

Read More..

పొత్తులపై రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు.. స్పందించిన తెలంగాణ జనసేన

Next Story