కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం.. కవితకు మద్దతుగా తరలివచ్చిన జనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 13:04:30  IST  )

‘తెలంగాణ జాగృతి’ (Telangana Jagruthi) రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించిన విషయం తెలిసిందే.

కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం.. కవితకు మద్దతుగా తరలివచ్చిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ జాగృతి’ (Telangana Jagruthi) రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. అయితే, తనను కలిసేందుకు వచ్చిన జనసందోహానికి కవిత ఆమె ఇంటి బాల్కనీలో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

అనంతరం కిందకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు ‘జై తెలంగాణ’, ‘కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలతో మారుమోగాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవిత గారికి అండగా ఉంటామని వివిధ సంఘాల నేతలు కవిత సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.

Read More..

Kavitha: వెక్కి వెక్కి ఏడ్చినా కవితకు డిపాజిట్లు కూడా రావు..మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

BRS: కేసీఆర్‍కు తెలియకుండానే బాయ్‍కాట్? ఆయన సొంత నిర్ణయంతో పార్టీకి డ్యామేజ్!

Next Story