- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రం ఎన్నడూ పేద రాష్ట్రం కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ఇవాళ ఆయన నాంపల్లి (Nampally)లోని బీజేపీ (BJP) ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం తెలంగాణ అని అన్నారు. స్వాతంత్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ప్రాంతంగా విలసిల్లిందని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నన్ని చెరువులు రాష్ట్రంలోనే లేవని కామెంట్ చేశారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాళా తీసిన రాష్ట్రంగా చూపడం సరికాదని అన్నారు. ధాన్యం దిగుబడి, జీఎస్డీపీ వృద్ధి రేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ (Congress) పార్టీని మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రమే అయినా.. తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తామని గతంలోనే చెప్పామని.. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లని అన్నారు. ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం పెరిగేదని పేర్కొన్నారు. 2023-24లో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు, 2024-25లో రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందని స్పష్టం చేశారు. పన్నేతర ఆదాయం కూడా 2014లోనే రూ.6 వేల కోట్లు ఉందని, 2023-24లో రూ.20 వేల కోట్ల పన్నేతర ఆదాయం ఉందని తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని.. పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని ఈటల హితవు పలికారు.
Read More..
కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంది.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్






