- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ యువతకు ఉపాధి లభించేలా శిక్షణ ఇవ్వాలి : మంత్రి సీతక్క
పలు సంస్థల యజమాన్యాలు ఇస్తున్న శిక్షణ యువతకు ఉపాధి లభించేలా ఉండాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : పలు సంస్థల యజమాన్యాలు ఇస్తున్న శిక్షణ యువతకు ఉపాధి లభించేలా ఉండాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో వారికి కొత్త అవకాశాలను అందించే వేదికగా ఈ సంస్థ నిలవాలని ఆకాంక్షించారు. ఇటువంటి సంస్థలు జిల్లాలో యువత భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకులు రవికుమార్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






