- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంది.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్
రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, అణా పైసా ఎవరూ ఇవ్వడం లేదని, బ్యాంకులకు వెళితే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, అణా పైసా ఎవరూ ఇవ్వడం లేదని, బ్యాంకులకు వెళితే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఎల్లారెడ్డిపేట్ (Yellareddypet)లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి (Delhi) వెళితే.. ప్రధాన మంత్రి తో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని అన్నారు. అదేవిధంగా అప్పు కోసం వెళితే తనను చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా చూస్తున్నారని అన్న సీఎం వ్యాఖ్యలపై.. బండి సంజయ్ అది కాంగ్రెస్ కల్చర్ కావొచ్చేమోనని సెటైర్లు వేశారు.
ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పా్ల్సింది పోయి రాష్ట్రం దివాళా తీసిందంటూ వారిలో అధైర్యం నింపుతారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని కామెంట్ చేశారు. ఇలా కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని అన్నారు. ప్రభుత్వం నడపలేమనే స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ (Congress) చేతులెత్తేసిందని పేర్కొన్నారు. ప్రజలు తమను ఓట్లు వేసి గెలిపించారని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ గాలికి వదిలిసినట్లుగా పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు తెలుసని.. అప్పుల గురించి తెలిసే హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా చెప్పేశారని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ‘సంవిధాన్’ చేతబట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని.. రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ‘ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్’ అన్న తీరుగా మారిందిని.. సీఎం వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. ఇక వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇవ్వరని, మహిళలకు నెలనెలా రూ.2,500, తులం బంగారం ఉత్త మాటలేనని తేలిందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇక రాదని, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా ఇవ్వరనే విషయం తేల్చేశారని పేర్కొన్నారు. మోసాల కాంగ్రెస్‌ను ఇక వదిపెట్టబోమని బండి సంజయ్ అన్నారు.
Read More: రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తుండు.. ఎంపీ ఈటల పైర్
Polavaram: పోలవరం నిర్మాణంపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది: మంత్రి నిమ్మల






