ఫిఫా ఫీవర్‌లో వైరల్ స్టార్‌గా మారిన ఆవు.. ఫుట్‌బాల్ స్కిల్స్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

by Ramesh Naini |

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2026 సందడి నెలకొంది. ఈ ఫుట్‌బాల్ ఫీవర్ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన, ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఫిఫా ఫీవర్‌లో వైరల్ స్టార్‌గా మారిన ఆవు.. ఫుట్‌బాల్ స్కిల్స్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2026 సందడి నెలకొంది. ఈ ఫుట్‌బాల్ ఫీవర్ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన, ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మనుషులు ఫుట్‌బాల్ ఆడటం చూసుంటాం, కానీ ఇక్కడ ఏకంగా ఓ ఆవు కుర్రాళ్లతో కలిసి గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

వీడియోలో ఏముందంటే?

గోవాలోని మర్డోల్ ప్రాంతానికి చెందినదిగా చెబుతున్న ఈ పాత వీడియో ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. వీడియోలో కుర్రాళ్లు ఫుట్‌బాల్ ఆడుకుంటుండగా.. బంతి వద్దకు వచ్చిన ఓ ఆవు, దాన్ని తన పాదాల వద్ద ఉంచుకుని ఎవరికీ ఇవ్వకుండా ఫుట్‌బాల్ పై తనకున్న ప్రేమను చాటుకుంది. ఎవరైనా కుర్రాళ్లు కష్టపడి బంతిని లాక్కుంటే.. వారి వెంటే పరిగెడుతూ మళ్లీ దాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడం, తన కాళ్లతో బంతిని కిక్ చేయడం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బంతిని పలుమార్లు తన్నుతూ తన ‘ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని’ ప్రదర్శించింది.

క్రిస్టియానో రొనాల్డో-కౌ

ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆవు ఫుట్‌బాల్ స్కిల్స్ చూసి ఫిదా అవుతూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ ఆవుకు ‘క్రిస్టియానో రొనాల్డో-కౌ (RonalCOW)’ అని.. మరికొందరు ‘కౌ-నెల్ మెస్సీ (COWonel Messi)’ అని సరదాగా పేర్లు పెడుతున్నారు. మొత్తానికి, ఫిఫా వరల్డ్ కప్ వేడిలో ఈ ‘ఆవు’ ఫుట్‌బాల్ ఓల్డ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది.

Next Story