- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెయిన్ బో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో పిల్లలు?
by Naga Rani Yarlagadda |
విజయవాడలోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వార్డులో ఉన్న పిల్లలను హుటాహుటిన మరోవార్డులోకి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. కాగా.. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమవారికి ఏమైందోనని కంగారుపడ్డారు.
Next Story






