ఆకుపచ్చ శారీలో అదరగొట్టిన శ్రీముఖి.. ఈ స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే?

by Pulgam srinivas |   (  Updated:2026-06-17 04:38:22  IST  )

పలుచటి గ్రీన్ చీరలో శ్రీముఖి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఆకుపచ్చ శారీలో అదరగొట్టిన శ్రీముఖి.. ఈ స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తొలుత నటిగా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత యాంకర్‌గా మారి తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. తన చురుకైన యాంకరింగ్‌తో పాటు గ్లామర్ ప్రెజెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

వీలు దొరికినప్పుడల్లా స్టైలిష్ అండ్ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునే శ్రీముఖి, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలలో పలుచటి ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోయిన ఈ బ్యూటీ, అందుకు మ్యాచ్ అయ్యే బ్లౌజ్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. మెడలో అందమైన హారం, చేతికి స్టైలిష్ యాక్సెసరీస్ ధరించి, నుదుటిపై చిన్న బొట్టు పెట్టుకుని కురులను అందంగా సెట్ చేసుకుంటూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది.

ఇక ఈ లుక్‌లో శ్రీముఖి మరింత అందంగా, హాట్‌గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story