- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సీ సరికొత్త ప్రపంచ రికార్డు: 200వ అంతర్జాతీయ మ్యాచ్‌లో హ్యాట్రిక్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-0తో ఘన విజయం సాధించింది. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగి, పలు అరుదైన ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
మెస్సీ ఖాతాలో చేరిన సరికొత్త రికార్డులు ఇవే
కెరీర్‌లో 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో ఆటగాడిగా మెస్సీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (228), బదెర్ అల్ ముత్వా (202) మాత్రమే మెస్సీ కంటే ముందున్నారు.
దిగ్గజం పీలే 56 ఏళ్ల రికార్డు బద్దలు
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధికంగా ఆరు ప్రపంచకప్‌లలో (2006 నుండి 2026 వరకు) పాల్గొన్న మొదటి ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన హ్యాట్రిక్‌తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్నాడు. తద్వారా వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ రికార్డును సమం చేశాడు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఐదు వేర్వేరు ప్రపంచకప్ ఎడిషన్లలో గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ భాగస్వామ్యం (24 గోల్స్ - 16 గోల్స్, 8 అసిస్ట్‌లు) అందించిన ఆటగాడిగా బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న 56 ఏళ్ల నాటి రికార్డును మెస్సీ తిరగరాశాడు. 38 ఏళ్ల వయసులోనూ మెస్సీ సృష్టించిన ఈ వండర్స్‌తో, అతనే ఫుట్‌బాల్ చరిత్రలో ‘గోట్’ (GOAT - Greatest of All Time) అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.






