అప్పుడు సంక్రాంతి ఇలా ఉండేది కాదు.. థియేటర్ల కేటాయింపుపై ఓపెన్ అయిన ఎం. ఎస్. రాజు

by Pulgam srinivas |

గతంలో సంక్రాంతికి అన్ని సినిమాలకు సమానంగా థియేటర్లు ఇచ్చేవారని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు.

అప్పుడు సంక్రాంతి ఇలా ఉండేది కాదు.. థియేటర్ల కేటాయింపుపై ఓపెన్ అయిన ఎం. ఎస్. రాజు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఎప్పటి నుంచో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ పండుగ సందర్భంగా అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం సంక్రాంతి పోటీ మరింత తీవ్రమైందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంక్రాంతి రిలీజ్‌ల పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే సంక్రాంతి పోటీ ఎలా మారింది? థియేటర్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే అంశాలపై ఆయన స్పందించారు.

ఇంటర్వ్యూలో భాగంగా, చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'అంజి', బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లక్ష్మీనరసింహ' చిత్రాలకు పోటీగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'వర్షం' సినిమాను సంక్రాంతి బరిలో నిలపడం గురించి ప్రశ్నించారు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణలతో పోలిస్తే ప్రభాస్ చిన్న హీరో అయినప్పటికీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడగగా ఎం.ఎస్. రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "నిజానికి అంత పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడటం చాలా పెద్ద రిస్క్. కానీ 'వర్షం' సినిమా నాకు చాలా నచ్చింది. అలాగే ఆ సినిమా పాటలు విడుదలకు ముందే భారీ ఆదరణ పొందాయి. అందుకే ఆ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన తెలిపారు.

ఇక ప్రస్తుతం సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేయడం చాలా కష్టంగా మారిందని ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు. "అప్పుడు ఒక పట్టణంలో 10 నుంచి 12 థియేటర్లు ఉంటే, ఎన్ని సినిమాలు విడుదలైనా వాటికి సమానంగా థియేటర్లు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ థియేటర్లలో ఒకే సినిమాను ప్రదర్శిస్తున్నారు. నాకు అప్పట్లో ఎప్పుడూ థియేటర్ల సమస్య ఎదురుకాలేదు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే అప్పుడు సంక్రాంతికి సినిమా విడుదల చేయడం చాలా సులభంగా ఉండేది" అని ఎం.ఎస్. రాజు చెప్పుకొచ్చారు.

Next Story