అనుమానాలుంటే చర్చకు రండి.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ సవాల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-17 07:53:34  IST  )

డీఎస్సీపై అనుమానాలు ఉన్నవాళ్లు చర్చకు రావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు.

అనుమానాలుంటే చర్చకు రండి.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీపై అనుమానాలు ఉన్నవాళ్లు చర్చకు రావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయింది. గొడ్డలి పార్టీ నేతల మాదిరిగా.. తాము బురదచల్లి పారిపోయే రకం కాదని విమర్శించారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉండి మాట్లాడుతున్నానని, డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే రెడీగా ఉన్నామని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సవాల్ ను స్వీకరించే ధైర్యం ఉన్నవారు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలను ఆపలేరన్నారు. కూటమి ప్రభుత్వం.. సాక్షి క్యాలెండర్ మాదిరి కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తోందని వైసీపీకి చురకలంటించారు.

తమ కార్యకర్త జగన్ భార్య అయిన భారతి పై ఒక పోస్టు చేసినందుకే అతడిని అరెస్ట్ చేయించి, జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. మహిళలకు తామిచ్చే గౌరవం అలాంటిదని లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీ సంస్కృతి వేరు, టీడీపీ సంస్కృతి వేరు.. ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారన్నారు. మహిళలను తిట్టేవారిని ప్రిజనరీ చుట్టూ పెట్టుకునే సంస్కృతి వైసీపీదని దుయ్యబట్టారు.

అంతకుముందు మంగళగిరి నియోజకవర్గంలో కాజ ఈస్ట్ లేక్ పార్కును కేంద్రమంత్రి పెమ్మసానితో కలిసి మంత్రి లోకేశ్ ప్రారంభించారు. సుమారు రూ.3.3 కోట్ల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా.. మంత్రి ఒక మొక్కను నాటారు. 17.18 ఎకరాల్లో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక హంగులతో.. సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పార్కును డెవలప్ చేసింది. ఈ పార్కులో 42 రకాల జాతులకు చెందిన 12,800 మొక్కలు ఉండటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Next Story