- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గౌస్ పల్లి సర్పంచ్
మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామ సర్పంచ్ పసులు కార్తీక్, ఉపసర్పంచ్ చింతనిప్పుల రఘు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామ సర్పంచ్ పసులు కార్తీక్, ఉపసర్పంచ్ చింతనిప్పుల రఘు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ములుగు మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క వారిని కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పై విశ్వాసంతో పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల ప్రశాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






