అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌కు క్రేజీ టైటిల్ ఫిక్స్?

by Pulgam srinivas |

వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో చిత్రానికి 'జనవరి 13 విడుదల' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌కు క్రేజీ టైటిల్ ఫిక్స్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాల టైటిల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. టైటిల్ ప్రకటించినప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు పెరిగేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల టైటిల్స్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి 'జనవరి 13 విడుదల' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే ఇదే టైటిల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే టైటిల్‌ను ఖరారు చేస్తే, టైటిల్ ద్వారానే సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, 'జనవరి 13 విడుదల' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తే, సినిమాను కూడా అదే తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మరి ఈ చిత్రానికి చివరికి ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Next Story