- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పానీ పూరి తిని ఆసుపత్రి పాలైన చిన్నారులు
by Batti.Sumithra |
పానీ పూరి తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన ఘటన తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.

X
దిశ, తంగళ్లపల్లి : పానీ పూరి తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన ఘటన తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. పానీ పూరి తిన్న 10 మందికి పైగా చిన్నారులు ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన చిన్నారులలో జ్వరంతో ఓ చిన్నారికి ఫిట్స్ కూడా రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. అయితే చిన్నారుల అస్వస్థతకు పానీపూరి తినడమే కారణమా..? లేక మరే ఇతర కారణాలున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితి పట్ల తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






