తమ శాఖల్లో అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : మంత్రులు

by Batti.Sumithra |

మాజీ మంత్రి హరీష్ రావు తమ శాఖల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు సవాల్ విసిరారు.

తమ శాఖల్లో అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : మంత్రులు
X

దిశ, తిమ్మాపూర్ : మాజీ మంత్రి హరీష్ రావు తమ శాఖల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు బస్సులో ప్రయాణించిన ఇద్దరు మంత్రులు ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులకు వివరించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎలా ఉంది అనే విషయమై పరిశీలించామని, ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం పై మహిళలు సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

పథకం ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రతిపక్షాలు ఆటో డ్రైవర్లను ప్రభుత్వం పైకి ఉసిగొల్పాయని అన్నారు. అయితే ఆటో కార్మికుల సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటీవల నీట్ పరీక్ష రద్దు కావడం, మళ్లీ ఆ పరీక్ష నిర్వహిస్తుండడంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆ రోజు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమ హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా రవాణా సదుపాయం కల్పించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు 1142 కోట్లతో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ జరిగితే హరీష్ రావు మాత్రం రెండు వేల కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధంగానే తమ ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతుందనే ఊహలో హరీష్ రావు ఉన్నారని అన్నారు. ఎస్సీ, బీసీ మైనారిటీ మంత్రుల మైనందునే హరీష్ రావు దొర తమపై తన అహంకారాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త తిరుపతి రెడ్డి, దావు సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story