- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో నిరుపయోగంగా మరుగుదొడ్లు : ప్రయాణికుల ఇక్కట్లు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీజీ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీజీ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజలతో పాటు ధూమాల, అక్కపల్లి, వీర్నపల్లి, మద్దిమల్ల, గర్జనపల్లి, సింగారం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో సుమారు వంద మంది మహిళలు నిత్యం ఈ ప్రయాణ ప్రాంగణాన్ని వినియోగిస్తున్నారు.
ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయని భావించి వచ్చిన మహిళలకు అవి వినియోగానికి లేకపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ముఖ్యంగా నీటి సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు పూర్తిగా మూతపడి, నిరుపయోగంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రయాణ ప్రాంగణంలోని బోరుబావికి మరమ్మతులు చేపట్టి, విద్యుత్ మోటారు ఏర్పాటు చేసి, మరుగుదొడ్లు, మూత్రశాలలకు నీటి సౌకర్యం కల్పించి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, సంబంధిత ఆర్టీసీ అధికారులు, స్థానిక సర్పంచ్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి మహిళల ఇబ్బందులను తొలగించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






