- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాన్‍పై ఢిల్లీ హైకోర్టుకు టెలిగ్రామ్ యాప్.. మరికాసేపట్లో విచారణ
నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్-యుజి (NEET UG 2026) రీ ఎగ్జామ్స్ పారదర్శకతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో టెలిగ్రామ్ (Telegram) యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ చర్య వల్ల లక్షలాది మంది చట్టబద్ధమైన వినియోగదారులపై అన్యాయంగా ప్రభావం పడుతోందని వాదిస్తూ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అత్యవసర విచారణకు హైకోర్డు అంగీకరించింది. మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ (Pavel Durov) నిషేధంపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన అసలు సూత్రధారులను వదిలేసి, కొందరు వినియోగదారులు లీక్డ్ మెటీరియల్‌ను షేర్ చేశారనే నెపంతో ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను వారం రోజుల పాటు నిషేధించిందని అన్నారు. ఈ నిషేధం వల్ల లీకేజీలు ఏమీ ఆగవని, ఆ లీక్‌లు కాస్తా ఇప్పుడు ఇతర యాప్‌లలోకి మారిపోతాయని పావెల్ దురోవ్ కామెంట్ చేశారు.






