గిటార్ వాయించి.. పూరీలు చేసి! తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు

by Ramesh Naini |

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కార్పోరేట్ స్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి () బుధవారం ప్రారంభించారు.

గిటార్ వాయించి.. పూరీలు చేసి! తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కార్పోరేట్ స్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సీఎం కలియతిరిగారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత అత్యాధునిక కిచెన్‌, ల్యాబ్స్‌, లైబ్రరీ, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, మ్యూజిక్ క్లాస్‌రూమ్, ప్లే గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అత్యాధునిక కిచెన్‌లో సిబ్బందితో కలిసి సీఎం పూరీలు చేశారు. తర్వాత మ్యూజిక్ క్లాస్ రూమ్‌కు వెళ్లి గిటార్ ప్లే చేశారు. అనంతరం ప్లే గ్రౌండ్‌‌ను సందర్శించి సరదాగా విద్యార్థులతో ఫుట్‌బాల్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Next Story