‘వారణాసి’ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Pulgam srinivas |

భారీ ధర కారణంగా ‘వారణాసి’ ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాకపోగా, పలువురు డిజిటల్ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

‘వారణాసి’  ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా భారీ అంచనాలు ఉన్న చిత్రాల హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ సంస్థలు పోటీపడుతుంటాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇప్పటివరకు క్లోజ్ కాలేదని సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అందుకు ప్రధాన కారణం, ఈ సినిమా ఓటీటీ హక్కులను సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఒకే సినిమా కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం కంటే, అదే ధరతో దాదాపు 40 నుంచి 50 చిన్న సినిమాల హక్కులను సొంతం చేసుకోవచ్చని ఓటీటీ సంస్థలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదని టాక్ వినిపిస్తోంది. ఈ డీల్‌ను పూర్తి చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు, పలువురు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంటుంది? ఎంత మొత్తానికి ఈ డీల్ కుదురుతుంది? అనే అంశాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story