ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

by Naga Rani Yarlagadda |

గుజరాత్ లోని వడోదరలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం తెల్లవారుజామున గుజరాత్ లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. వడోదర - జరోద్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. కోటంబి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న లగ్జరీ బస్సు, ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి అతివేగంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఘటనపై సమాచారం అందుకున్న జరోద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. NDRF కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మందికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించి కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల లేదా ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Next Story