- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తొలి సినిమా కోసం చిరంజీవిని కలిస్తే అలా అన్నారు.. జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తన తొలి సినిమా ‘సింహ స్వప్నం’ కోసం చిరంజీవిని క్లాప్ కొట్టమని అడగగా, ఆత్మీయంగా స్పందించి వెంటనే వచ్చారని జగపతిబాబు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన తొలి సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జగపతిబాబు మాట్లాడుతూ.. “నేను నటించిన తొలి సినిమా ‘సింహ స్వప్నం’. ఆ సినిమాకు క్లాప్ కొట్టించేందుకు నేను, మా నాన్నగారు కలిసి చిరంజీవి గారిని అడగాలని ఆయన ఇంటికి వెళ్లాం. ఆ సమయంలో ఆయన పీక్ స్టార్‌గా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు. అయినప్పటికీ మేము వెళ్లగానే ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను చూసి ‘చాలా అందంగా ఉన్నావు’ అంటూ ప్రశంసించారు” అని తెలిపారు.
అలాగే, తన తొలి సినిమాకు క్లాప్ కొట్టమని అడగ్గానే చిరంజీవి వెంటనే అంగీకరించి వచ్చారని చెప్పారు. ఇక 35 సంవత్సరాల తర్వాత ‘పెద్ది’ సినిమాలో తన పాత్రను చూసి చిరంజీవి అదే స్థాయిలో ప్రశంసించారని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గురించి జగపతిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోగా ఎన్నో సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ కొనసాగించిన జగపతిబాబు, ప్రస్తుతం కీలక మరియు విలన్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.






