- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్ల అవినీతి తిమింగలం.. రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

దిశ, వెబ్‌డెస్క్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచీ ఆయన ఇళ్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. రూ.100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో నరహరిరావును హాజరుపరచగా.. కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
నరహరి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.1.54 కోట్ల నగదు, బ్యాంక్ అకౌంట్లలో రూ.2.29 కోట్లు, ఆయన పేరిటే రూ.5 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక భారీగా బంగారం, వెండి ఆభరణాలను కూడా సీజ్ చేశారు. ఆయన ఇంటిలో 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా విలువైన బాండ్ పేపర్లు, ల్యాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో ఒక జీ ప్లస్ 3 భవనం, నార్సింగిలో 2 హైరైజ్ బిల్డింగ్స్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మరికొన్ని హైరైజ్ బిల్డింగ్స్ ను అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో వ్యవసాయ భూమి, ఛత్రినాకలో జీప్లస్ 2 బిల్డింగ్ లకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఆయన సంపాదనకు, సోదాల్లో బయటపడిన కళ్లు చెదిరే స్థిరాస్తులకు ఏమాత్రం సంబంధం లేకపోవడంతో ఏసీబీ అధికారులే వాటిని చూసి షాకయ్యారు. వాటన్నింటి విలువ మార్కెట్లో సుమారు రూ.100-రూ.150 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.






