- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి రాజీవ్ రహదారి పై చెలరేగిన మంటలు
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 6వ డివిజన్‌లోని బొమ్మకల్ బైపాస్ రాజీవ్ రహదారి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చెత్తకు మంటలు అంటుకుని దట్టమైన పొగలు అలుముకున్నాయి.

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 6వ డివిజన్‌లోని బొమ్మకల్ బైపాస్ రాజీవ్ రహదారి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చెత్తకు మంటలు అంటుకుని దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే, గత కొంతకాలంగా పరిసర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వేడుకల అనంతరం మిగిలిపోయిన వివిధ రకాల వ్యర్థాలు, రసాయన పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, జంతువుల కళేబరాలను రాజీవ్ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ పక్కన పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ మినీ డంపింగ్ యార్డు ఏర్పడి, నిత్యం దుర్వాసన వెదజల్లడంతో పాటు తరచూ మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, అక్రమంగా చెత్త పారబోసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మిడిదొడ్డి కపిల్ మాధవ హెచ్చరించారు.






