- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్త్ అమెరికాలో సమంత క్రేజ్ మామూలుగా లేదు.. క్రేజీ హీరోలతో పోటీ
'మా ఇంటి బంగారం' చిత్రానికి నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే 125K+ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లను నార్త్ అమెరికాలో జూన్ 18వ తేదీనే ప్రదర్శించనున్నారు. ఈ మూవీకి నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ద్వారానే అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ద్వారా 125K+ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇటీవలి కాలంలో ఓవర్సీస్ మార్కెట్‌లో స్టార్ హీరోల సినిమాలకే భారీ స్థాయిలో వసూళ్లు రావడం కాస్త కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఈ స్థాయి స్పందన రావడం విశేషంగా మారింది. విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడటంతో సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటే నార్త్ అమెరికాలో అద్భుతమైన కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సమంత రూత్ ప్రభు తన సొంత నిర్మాణ సంస్థ 'త్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించారు. అలాగే ప్రముఖ దర్శక, నిర్మాతలైన రాజ్ నిదిమోరు, కృష్ణ డి.కె.లకు చెందిన 'డి2ఆర్ ఫిలిమ్స్' సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యమైంది.






