- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో సందడి చేయనున్న సమంత.. ప్రమోషన్స్ తర్వాత విజయ్‌తో భేటీ?
చెన్నైలో ప్రచార కార్యక్రమాల అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను సమంత కలవనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రంలో నటించింది. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల నేపథ్యంలో సమంత భారీ స్థాయిలో ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఒకే రోజులో దాదాపు 40 సోషల్ మీడియా, టీవీ ఇంటర్వ్యూలలో పాల్గొన్నట్లు సమాచారం. దీనిని పలువురు రికార్డు స్థాయి ప్రచారంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన సమంత, నేటి నుంచి తమిళనాడులో కూడా ప్రమోషన్లు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎంగల్ తంగం' పేరుతో విడుదల చేయనున్నారు.
ప్రమోషన్లలో భాగంగా నేడు సమంత చెన్నైలో సందడి చేయనుందని సమాచారం. ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు తమిళనాడుకు వెళ్లినప్పుడు అక్కడి ముఖ్యమంత్రి విజయ్‌ను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సమంత కూడా సినిమా ప్రమోషన్ల అనంతరం విజయ్‌ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్-సమంత కాంబినేషన్‌లో గతంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో, ఆయనను సమంత కలవబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






