- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Caste Census: బీసీ బంద్ వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!.. ఆ వివరాలు పబ్లిక్ డొమైన్ లోకి?
బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా?

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? ఇన్నాళ్లు బహిర్గతం చేయని కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయబోతోందా? తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టలేదని, నిజంగానే కాంగ్రెస్‍కు చిత్తశుద్ధి ఉంటే ఈ వివరాలు బయటపెట్టేవాళ్లు కదా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా (Empirical data) అంతా పబ్లిష్ చేస్తామన్నారు. ఇవాళ బీసీ బంద్‍లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపిరికల్ డేటా వివరాలు బయటపెట్టకపోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయని ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదనే ఈ వివరాలు పబ్లిక్ డొమైన్‍లో ఇంత కాలం పెట్టలేదన్నారు. కానీ కోర్టుల్లో సమర్పించిన వివరాలతోనే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.
బీఆర్ఎస్ లా కాదు:
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేతోనే తెలంగాణలో బీసీల లెక్కలు తేలాయని వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు ఇవ్వదని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం అని తెలిసినా కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి కోర్టుకు వెళ్లినట్లు తాము బీసీ రిజర్వేషన్ల విషయంలో చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా డిప్యూటీ సీఎం, బీసీ మంత్రులం హాజరయ్యామని ఇలాంటిది చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. బీసీలకు న్యాయం జరిగే ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదని మంత్రినై ఉండి కూడా రెండు రోజుల పాటు తాను హైకోర్టులోనే ఉన్నానని చెప్పారు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లాల్సింది కాదని ఈ అంశాన్ని బీసీ రిజర్వేషన్లకు ముడిపెట్టవద్దన్నారు. ఇది వేరే విషయం అని ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటున్నారని చెప్పారు. కొండా సురేఖ అంశాన్ని చూపుతూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తక్కువ చేయొద్దన్నారు.
కులగణన వివరాల కోసం ప్రతిపక్షాల డిమాండ్:
రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ శాఖ ద్వారా నిర్వహించిన కులగణన లెక్కల కోసం ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కులగణన వివరాలు బయటపెట్టాలని కోరుతున్నాయి. అయితే ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశామని ఈ వివరాలతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు పన్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. కులగణన వివరాలు బహిర్గతం చేస్తే వ్యక్తుల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలుగుతుందని అందువల్లే పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్‍లో ఉంచకుండా అందులోని సారాంశాన్ని మాత్రమే వెల్లడించామని వాదిస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వివరాలను పబ్లిక్ డొమైన్‍లో ఏమైనా ఉంచబోతోందా? వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. మొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను (BC reservations) చాలెంజ్ గా తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందడుగు వేయబోతోంది అనేది వేచి చూడాలి.
Read More..
కుల గణనలో తెలంగాణా దేశానికే ఆదర్శం.. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్
షాద్‌నగర్ బీసీ బంద్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్






