- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్‌పార్క్‌కు సీఎం రేవంత్.. అమరవీరులకు నివాళి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ కు చేరుకున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి.. నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకు ముందు ఎక్స్ వేదికగా.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సంవత్సరం.. నిన్నటి త్యాగాలను స్మరించుకుంటూ, రేపటి లక్ష్యాలను సమీక్షించుకునే భావోద్వేగ సందర్భమిది అని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. సుమారు 1000 మంది పోలీసులు బందోబస్త్ నిర్వహిస్తున్నారు.
ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వరంగల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ములుగులో మంత్రి సీతక్క, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.






