BREAKING: తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-27 09:33:40  IST  )

నేడో, రేపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న క్రమంలో.. తెలంగాణలో ఐదుగురు డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

BREAKING: తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడో, రేపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న క్రమంలో.. తెలంగాణలో ఐదుగురు డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ ట్రాన్స్ఫర్లు చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన వారు తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయి కొత్త పోస్టింగ్ విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రధాన బదిలీలు ఇవీ..

ఎస్. సారంగపాణి

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీపీఏ స్టాండ్స్‌లో డీఎస్పీగా, ఇల్లందు ఎస్‌డీపీఓగా విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎస్‌డీపీఓ పోస్టింగ్ రద్దయ్యింది.

పద్మనాభుల శ్రీనివాస్

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పీగా ఉన్న ఆయనను వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి, జీహెచ్‌ఎంసీ అదనపు ఎస్‌పీ ఖాళీ పోస్టులోనే కొనసాగించాలని నిర్ణయించారు.

యు. వెంకన్న బాబు

ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న వెంకన్న బాబును ఇల్లందు ఎస్‌డీపీఓగా నియమించారు.

బి. ప్రకాశ్

సైబరాబాద్‌లో ఏసీపీ (ఎస్‌బీ)గా పనిచేస్తున్న ప్రకాశ్‌ను నిజామాబాద్ (టీ) ఏసీపీగా బదిలీ చేశారు.

ఎల్.ఆర్. వెంకట్ రెడ్డి

నిజామాబాద్ (టీ) ఏసీపీగా ఉన్న వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా విధుల్లో చేరిన తర్వాత సీటీసీ నివేదికలు సమర్పించాలని సూచించారు.

READ MORE .....

Phone pay fraud: కేసు దర్యాప్తు చేస్తున్నాం డబ్బులివ్వండి.. బాధితుడికే సీఐ లంచం డిమాండ్!

Next Story