- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశం మొత్తం తిరుగుతా.. మోడీని ఎండగడతా: వీహెచ్ కీలక ప్రకటన
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. జనగణనలో భాగంగా బీసీ కులగణననూ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. జనగణనలో భాగంగా బీసీ కులగణననూ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం పదిన్నర గంటల నుంచి ఆయన దీక్ష మొదలెట్టారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. జనగణనలో బీసీల కాలం మెన్షన్ చేయాలి. బీసీ జనం పెరుగుతున్నారు.. జనగణన ద్వారా మాకు న్యాయం చేయాలి. ఎస్సీ, ఎస్టీల న్యాయం చేస్తున్నారు.. బీసీలు మీకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. మోడీకి రెండు లెటర్స్ రాశాము.. వాటికి జవాబు చెప్పాలి. బీసీలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే మోడీ తెలంగాణకు రావాలి. బీసీలకు న్యాయం జరగాలి.. ఉద్యోగాలు రావాలి.. మోడీ నిర్ణయం తీసుకునేలా తెలంగాణ బీజేపీ ఎంపీ ఒత్తిడి చేయాలని. దేశాన్ని ముక్కలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ, మతపరంగా ముందుకు వెళ్తోంది. మహిళా రిజర్వేషన్లలోనూ బీసీలకు కోట ఇవ్వలేదు.. దీనిపై మా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడారు.. తరచూ బీసీని అని చెప్పుకునే మోడీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలి. లేకపోతే దేశం మొత్తం తిరిగి మోడీని, బీజేపీని ఎండగడతా అని వీహెచ్ కీలక ప్రకటన చేశారు.
ప్రధాని మోడీ పర్యటన వేళ.. ఓబీసీ కులగణనపై VH నిరవధిక నిరాహార దీక్ష షురూ






