ప్రధాని మోడీ పర్యటన వేళ.. ఓబీసీ కులగణనపై VH నిరవధిక నిరాహార దీక్ష షురూ

by Prasad Jukanti |   (  Updated:2026-05-09 06:33:31  IST  )

జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అంబర్‌పేటలోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ప్రధాని మోడీ పర్యటన వేళ.. ఓబీసీ కులగణనపై VH నిరవధిక నిరాహార దీక్ష షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: జనగణనలో బీసీ కులాల గణన చేపట్టాలన్న డిమాండ్‍తో ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఇవాళ అంబర్‍పేటలోని తన నివాసంలో శనివారం దీక్ష ప్రారంభించారు. రాజకీయ పార్టీలకి అతీతంగా బీసీల అభ్యున్నతికి, బీసీ జనాభా ప్రతిపాదికంగా న్యాయం జరగాలంటే జనగణనలో బీసీ జనాభా కూడా లెక్కించాలి వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని ఈ విషంలో ఈ నెల 8వ తేదీలోపు స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటకు రావాలని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వీహెచ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇవాళ్టి నుంచి ఆయన దీక్షకు దిగారు. తాను ప్రధానికి పలుమార్లు లేఖలు రాసినా సరైన స్పందన లేకపోవడంతో దీక్ష చేపట్టినట్లు ఈ సందర్భంగా వీహెచ్ తెలిపారు.

Next Story