- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. 2026-27 వార్షిక బడ్టెట్‌కు ఆమోదం!
తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఉదయం 9.30కి అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నేరుగా సభకు చేరుకుంటారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ పద్దులను సభ ముందు పెట్టనున్నారు. ఈ సారి దాదాపు రూ.3.15 లక్షల కోట్ల నుంచి రూ.3.22 లక్షల కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లుగా తెలుస్తోంది.






