‘ఫ్యూచర్ సిటీ’కి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వేల కోట్ల నిధులు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 03:01:04  IST  )

తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.3.15 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించారు.

‘ఫ్యూచర్ సిటీ’కి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వేల కోట్ల నిధులు!
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రూ.3.15 లక్షల కోట్లకుపైగా అంచనాలతో 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దును ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని వాస్తవిక బడ్జెట్‌ను తయారు చేసినట్లు తెలిసింది. 2025–26లో రూ. 3.04లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా జీఎస్టీ స్లాబుల తగ్గింపు ప్రభావం రాష్ట్ర ఆదాయంపై ఎఫెక్ట్ చూపించింది. అలాగే రాష్ట్ర సొంత ఆర్థిక మార్గాలైన రిజిస్ట్రేషన్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో రివైజ్డ్ బడ్జెట్ రూ.2.80 కోట్ల వరకు ఉండటంతో 2026–27 బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దగ్గరలో రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

ప్యూచర్ సిటీపై ఫోకస్

సాధ్యమైనంత తొరగా ప్యూచర్ సిటీని అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్యూచర్ సిటీ పేరుతో హెడ్ అఫ్ ది అకౌంట్‌ను తయారు చేశారు. రానున్న రోజుల్లో ఆ పద్దు కింద ప్యూచర్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం సులువు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మున్సిపల్, పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బీ, ఇండస్ట్రీతో పాటు మరో మూడు నాలుగు శాఖల సమన్వయంతో ప్యూచర్ సిటీని డెవలఫ్మెంట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం 2026–27 బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతోన్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచలేదని విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొంత మేర ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు నిధులు కేటాయిస్తారని టాక్ ఉంది. మూసీ నది పునర్జీవనం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

2027–28 విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాబోధన అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం ఇప్పటివరకు సాంక్షన్ చేసిన 105 స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన నిధులను 2026–27 బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్క స్కూల్‌ సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు కేవలం 12 చోట్ల మాత్రం పనులు ప్రారంభం అయ్యాయి. మిగతా చోట్ల సైతం పనులు మొదలుపెట్టేందుకు కావాల్సిన నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

భట్టి, ఉత్తమ్..

నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, కౌన్సిల్‌లో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 11.00గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో 2026–27 బడ్జెట్‌ను అమోదించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది.

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. 2026-27 వార్షిక బడ్టెట్‌కు ఆమోదం!

Next Story