ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 06:38:38  IST  )

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో 2026-27 వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం మూకుమ్మడిగా ఆమోదం తెలిపింది.

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సమావేశంలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. అందుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతులు ఉన్న బ్యాగ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డికి అందజేయగా.. వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా సభకు బయలుదేరారు. అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్షిక బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను చదివి వినిపించనున్నారు.

అసెంబ్లీ కమిటీహాల్‌లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం

మరికాసేపట్లో బడ్జెట్.. నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు

Next Story