అసెంబ్లీ కమిటీహాల్‌లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

అసెంబ్లీ కమిటీహాల్‌లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‍లో ఎలాంటి నిర్ణయాలతో రాబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుంది.

Next Story