మరికాసేపట్లో బడ్జెట్.. నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 07:44:17  IST  )

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ప్రజాభవన్‍లో నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరికాసేపట్లో బడ్జెట్.. నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (Telangana Budget 2026-27) పద్దును సభలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరి కాసేట్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభలో బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఆయన తన అధికారిక నివాసం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీ చేరుకున్నారు. అంతకు ముందు ప్రజాభవన్‍లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో బడ్జెట్ ప్రతులకు అర్చకులు పూజలు చేశారు. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్‍లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట:

కాగా ఈసారి బడ్జెట్‍లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్ద పీటవేయబోతున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8-10 శాతం అదనంగా పెంచి రూ. 3.29 లక్షల కోట్ల నుంచి రూ. 3.30 లక్షల కోట్ల వరకు చూపే అవకాశం కనిపిస్తోంది.

గిరిజనుల కోసం 100 శాతం సబ్సిడీతో ‘ఇందర సౌర గిరి జల వికాసం’

Next Story