గిరిజనుల కోసం 100 శాతం సబ్సిడీతో ‘ఇందర సౌర గిరి జల వికాసం’

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-20 07:43:09  IST  )

తెలంగాణలోని మారుమూల ప్రాంతాలల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,600 కోట్లను కేటాయించింది.

గిరిజనుల కోసం 100 శాతం సబ్సిడీతో ‘ఇందర సౌర గిరి జల వికాసం’
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని మారుమూల ప్రాంతాలల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,600 కోట్లను కేటాయించింది. ఈ నిధులను ‘ఇందర సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఖర్చు చేయనున్నారు. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2.10 లక్షల గిరిజన రైతులకు లబ్ధిచేకూర్చనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాంరంభించామని, దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని భట్టి తెలిపారు.

మరికాసేపట్లో బడ్జెట్.. నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు

Next Story