కేసీఆర్ ఏ బ్రాండ్ తాగి బయటకు వచ్చాడో.. టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-25 07:16:55  IST  )

ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆద్యుడంటూ ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ (KCR) వాగ్భానాలు సంధించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ ఏ బ్రాండ్ తాగి బయటకు వచ్చాడో.. టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆద్యుడంటూ ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ (KCR) వాగ్భానాలు సంధించిన విషయం తెలిసిందే. గతంలో విశాఖలో జరిగిన సీఐఐ (CII) సదస్సులో రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు అంటూ హంగామా చేశారని, ఎంవోయూలపై సంతకాలు చేసింది స్టార్ హోటళ్లలోని వంట మనుషులు, సప్లై చేసేవాళ్లంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు (MLA MS Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రెండేళ్లుగా ఫార్మ్‌హౌస్‌లో పడుకుని ప్రజలకు ముఖం చూపించుకోలేదని, ఏ బ్రాండ్ మందు తాగి బయటకు వచ్చాడో తెలియదంటూ సెటైర్లు వేశారు. తనను తాను దేశ్ కీ నేతగా ప్రకటించుకున్నాడని, గ్రామాల్లో సర్పంచ్‌లు ఓడిపోవడంతో మతి భ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక కేటీఆర్ (KTR) లాంటి అసమర్థ వ్యక్తిని నమ్మితే పార్టీ మునిగిపోతుందని, ఆయనను నమ్మకపోవడమే కేసీఆర్ బయటకు రావడానికి కారణమని కామెంట్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం వల్లే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడి కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.

Read More..

రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లే మూసీలో ప‌డేస్తారు.. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్

రైతులకు బేడీలు వేయడం పాపమే.. అందులో మేమందరం భాగమే: ఎమ్మెల్సీ కవిత

Next Story